న్యూఢిల్లీ: ఈ నెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్త బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కారణంగా ఈ నెల 27న, ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అదనంగా పని చేస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
రెండు రోజుల వారాంతపు సెలవుల(ఈ నెల 26, 27) తర్వాత సమ్మె మొదలు కానున్న నేపథ్యంలో వినియోగదారులకు సేవల్లో సుదీర్ఘ కాలం అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ నెల 27న బ్యాంకులు, బ్యాంకింగ్ ఆఫీసులు, ఏటీఎంతో కూడిన శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు(పెట్టెలు) పనిచేసేందుకు ఆర్బీఐ కూడా ఆమోదం తెలిపింది.