సీఎం కేసీఆర్ మినీ అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేసినందుకు ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి కేక్ కట్ చేసి, ఉద్యోగులకు తినిపించారు.
ఉద్యోగులు బతుకమ్మ ఆడి, పటాకులు కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు ఎంతో రుణపడి ఉంటామని ఆ సంఘం అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి తెలిపారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవితకు ఉద్యోగుల తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.