Asaduddin Owaisi | హైదరాబాద్ : అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు అని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు అని ఆయన గుర్తు చేశారు.
జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలి. పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుంది.. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యుద్ధం జరిగితే.. భారతదేశంలోని ముస్లింలు దేశం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉంటారని ఇటీవల ఓవైసీ కామెంట్స్ చేశారు. మా దేశాన్ని రక్షించడానికి ఏదైనా చేస్తామన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని.. ఉగ్రవాదం ఏ దేశానికి మంచిది కాదని హితవు పలికారు.
అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు
జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలి
పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుంది.. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు
అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు
అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై… pic.twitter.com/0eVRNry9Ma
— Telugu Scribe (@TeluguScribe) May 10, 2025