హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): రాహుల్‌గాంధీకి హైదరాబాద్‌లో పోటీ చేసే దమ్ము ఉన్నదా? అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ చేశారు. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ఎంఐఎం పార్టీ అస్సాం, మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి రాష్ర్టాల్లో అభ్యర్థులను నిలబెట్టిందంటూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పాతబస్తీలో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ చెప్తున్నట్టుగా ఎంఐఎం ఎన్నడూ అస్సాంలో పోటీ చేయలేదని స్పష్టంచేశారు. రాహుల్‌గాంధీ ఓడిపోయిన అమేథిలో ఎంఐఎం పోటీ చేసిందా? అని ప్రశ్నించారు. ఎంఐఎం రాజస్థాన్‌లో తొలిసారిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు.