Mid Day Meals | హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మ ధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేసే అం శం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంటర్ విద్యా క మిషనరేట్ తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఈ పథకం అమలు విషయమై ప్రతిపాదనలను సి ద్ధంచేసి ఈ నెలలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది.
424 ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో లక్షన్నరకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఉదయం కళాశాలకొచ్చే విద్యార్థులు సాయం త్రం వరకు ఉండటం లేదు. ఆకలికి ఓర్చుకోలేక మధ్యాహ్నమే ఇంటిబాట పడుతున్నారు. మరికొందరు మధ్యలోనే చదువు ఆపేస్తున్నా రు. దీంతో ఏటా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది. స ర్కారు కాలేజీలను బలోపేతం చేయడం, డ్రా పౌట్స్ను నివారించేందుకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి కోరనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.