రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మిడ్ మానేరు ప్రాజెక్టు.. ఓ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటోంది. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో కళకళలాడిపోతోంది. ఇప్పుడు మిడ్ మానేరు.. కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ జంక్షన్‌గా మారిందని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ టూరిజం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
Backwaters of the beautiful Mid Manair (Sri Raja Rajeshwara Reservoir). It is now officially the water junction of #KaleshwaramProject
— KTR (@KTRTRS) July 13, 2021
Had a great potential for tourism @tstdcofficial is working on several plans pic.twitter.com/ASsKumCetG