MEPMA | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): పట్టణ పేదరిక నిర్మూలన పథకం(మెప్మా) ఉద్యోగులు ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. 9 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, సర్కారు బిల్లులు చెల్లించడం లేదని, పైరవీలు చేసుకున్నవాళ్లకే నిధులు విడుదల చేస్తున్నదని మండిపడుతున్నారు.
జీతాలు లేక కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసుకున్నా ప్రభుత్వ పెద్దలు, అధికారులు పట్టించుకోవడం లేదని, త్వరలోనే ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు మెప్మా రిసోర్స్ పర్సన్స్ అసోసియేషన్ నాయకురాలు సునీత తెలిపారు.