హుజూరాబాద్ టౌన్, జూలై 21 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని సిటీ సెంటర్ హాల్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాకు దాదాపు ఐదు వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
85 ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు మూడు వేల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు స్ఫూర్తి, ప్రోత్సాహంతో రాష్ట్రంలోని మల్టీ నేషనల్ కంపెనీలను హుజూరాబాద్‌కు తీసుకువచ్చి, మెగా జాబ్ మేళా నిర్వహించినట్టు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు.