హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో తమపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదిగా ఉన్న ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)తోపాటు పోలీసులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
జస్టిస్ మౌసమీ భట్టాచార్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్ 13కు వాయిదా వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేటీఆర్, జగదీశ్‌రెడ్డి నకిలీ వీడియోలను విడుదల చేసి తనను అప్రతిష్టపాలు చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో నిరుడు మే 25న కేసు నమోదైంది.