సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 13:37:07

రాష్ట్రంలో 4990 మెడిక‌ల్ సీట్లు: కాళోజీ వ‌ర్సిటీ వీసీ

రాష్ట్రంలో 4990 మెడిక‌ల్ సీట్లు: కాళోజీ వ‌ర్సిటీ వీసీ

వ‌రంగ‌ల్‌: కాళోజీ ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యింద‌ని వీసీ క‌రుణాక‌ర్ రెడ్డి అన్నారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్ అడ్మిష‌న్ల కోసం ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని తెలిపారు. నీట్ ర్యాంకు ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 4800 సీట్ల‌తోపాటు ఈడ‌బ్ల్యూఎస్ విభాగంలో 190 సీట్లు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. ఇందులో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల్లో 1,500 సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో 2750 సీట్లు, మైనార్టీ కాలేజీల్లో 550 సీట్లు అందుబాటులో ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. వెబ్ ఆప్ష‌న్ల ద్వారా సీట్లు కేటాయిస్తున్నామ‌ని చెప్పారు. క‌రోనా నేప‌థ్యంలో ఆన్‌లైన్‌లోనే స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ చేస్తున్నామ‌ని తెలిపారు. కాలేజీలు ప్రారంభ‌మైన త‌ర్వాత ఫిజిక‌ల్ వెరిఫికేష‌న్ ఉంటుద‌న్నారు. ఆలిండియా కోటాలో వెళ్లిన‌వారు స‌ర్టిఫికెట్ అప్లోడ్ చేయ‌క‌పోతే అన‌ర్హుల‌ని ప్ర‌క‌టించారు. క‌రోనాను బ‌ట్టి ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం త‌రగతులు ప్రారంభిస్తామ‌ని చెప్పారు.