Temperature | భానుడి సెగలు.. జనం బెంబేలు..వచ్చే మూడ్రోజుల్లో మరింత తీవ్రం
భానుడి భగభగలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రతకు వడగాలులు తోడుకావడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో మధ్యాహ్నం వేళల్లో జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
- వచ్చే మూడ్రోజుల్లో మరింత తీవ్రం
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): భానుడి భగభగలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రతకు వడగాలులు తోడుకావడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో మధ్యాహ్నం వేళల్లో జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3, 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
శనివారం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయని వెల్లడించింది. మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లోని కెరమెరి, దస్తూరాబాద్, అకినపల్లిలో 44.3 డిగ్రీలు, కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 44.2, జగిత్యాల జిల్లా రాయికల్‌లో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నది. అతితక్కువగా వికారాబాద్ జిల్లాలో 40.8 డిగ్రీలు నమోదైనట్టు తెలిపింది. వచ్చే మూడ్రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

