హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను బదిలీ చేసింది. ఇటీవలే ఐఏఎస్, ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పించిన సర్కారు.. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 కమిషనర్లకు పదోన్నతులు ఇవ్వడంతోపాటు స్థానచలనం కల్పించింది. ఒకేసారి 129 మంది మున్సిపల్ కమిషనర్లను వివిధ జిల్లాలు, జీహెచ్ఎంసీకి బదిలీచేస్తూ పురపాలకశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.
జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు అరుణకుమారి, యాదయ్య, మోహన్‌రెడ్డి, రవికుమార్‌కు పదోన్నతి కల్పించారు. మరో డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్‌ను మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీచేశారు. అమరచింత మున్సిపల్ కమిషనర్ రవిబాబును నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు డిప్యూటీ కమిషనర్‌గా స్థానచలనం కల్పి ంచారు. సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీలు మధుకిరణ్, మల్లికార్జున్రా వు, యాదయ్యను జీహెచ్ఎంసీకి బదిలీ చేశారు. వివిధ హోదాల్లో ఉన్నవారికి పదోన్నతులు కల్పిస్తూ బదిలీలు చేశారు.