హైదరాబాద్ : మెట్రో రైలుకు (Metro Rail ) ఉన్న భూములను, ఆస్తులను బినామీలకు అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ( Dasoju Sravan ) సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేశారు. మెట్రో రైలు కొనుగోలు పెద్ద కుంభకోణమని( Scam ) ఆరోపించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మెట్రో రైలు ఆలస్యానికి కేసీఆర్ ( KCR ) కారణమని ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. నాటి కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రుల అసమర్ధ కారణంగా మెట్రో ఆలస్యమైతే దానిని కేసీఆర్‌పై రుద్దడం శోచనీయమని అన్నారు. పరిపాలన చేతగాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన, అనుభవరాహిత్యంతో తెలంగాణను ఆగం చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ మెట్రోను విజయవంతంగా నిర్వహిస్తే అధికారంలోకి వచ్చిన తరువాత రేవంత్ గంగపాలు చేశారని ఆరోపించారు. మెట్రోను తక్కువకే ఎందుకు కొనుగోలు చేశారని, 13 వేల 530 కోట్ల ఎల్అండ్టీ అప్పును తెలంగాణ ప్రజల మీద ఎట్లా వేస్తారని ప్రశ్నించారు. క్యూర్, ప్యూర్, రేర్ అంటూ చిల్లర పరిపాలనను చేస్తున్నాడని ఆరోపించారు.
క్యూర్‌పై రేవంత్, కాంగ్రెస్ నాయకులకు గాని ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు. చారిత్రక కట్టడాలను కాపాడుతూనే మెట్రోరైలును పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌దేనని వెల్లడించారు. రేవంత్‌కు చరిత్రమీద, కట్టడాల మీద ఏమాత్రం గౌరవం లేదని, మసీదులను, గుడిలను కూలగోడుతూ గుడిలోని లింగాన్ని కూడా మింగుతున్నారని విమర్శించారు.