చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) జరిగింది. మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న తాండూరు డిపో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లతో సహా 17 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టిప్పర్లో ఉన్న కంకర బస్సులో పడటంతో కంకర కింద ప్రయాణికులు చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు 20 మంది ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానతోపాటు, ప్రైవేటు దవాఖానలకు తలరించారు. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తున్నది.







