బూర్గంపహాడ్, ఏప్రిల్ 17 : ఐటీసీలో 14వ వేతన ఒప్పంద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ వద్ద కార్మిక సంఘం నాయకులు, కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి మాట్లాడుతూ.. వేతన ఒప్పంద చర్చలు ఆరు నెలలుగా సాగుతున్నా ఇప్పటివరకు పూర్తి చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. వేతన ఒప్పంద ప్రక్రియ పూర్తిచేయని పక్షంలో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.