హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు అమరవీరులను స్మరించుకుంటూ ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వరకు అమరవీరుల స్మృతి వారోత్సవాలను నిర్వహించాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కోరింది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను కోలుకోలేని దెబ్బ తీసిందని తెలుపుతూ.. మావోయిస్టులు గోండు మాండలికం, ఇంగ్లిషులో 24పేజీల బుక్లెట్ను మంగళవారం విడుదల చేసింది.
ఈ ఏడాదిలో 357మంది మావోయిస్టులను హత్య చేశారని, ఇందులో136మంది మహిళలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ హత్యాకాండల్లో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 15మంది రాష్ట్ర కమిటీ సభ్యులు మృతి చెందారని పేర్కొన్నది.