అచ్చంపేట, ఏప్రిల్ 1 : గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నా పోలీసులు పట్టించుకోరా అని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి లో వారు పర్యటించారు. కాంగ్రెస్ అచ్చంపేట మండల అధ్యక్షుడు నర్సయ్య యాద వ్ అంకిరోనిపల్లిలో రోడ్డును ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేస్తుండగా గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు పరిశీలించడానికి వెళ్లిన బీఆర్ఎస్ గిరిజన మహిళాసర్పంచ్ కొర్ర కమల, ఆమె భర్త సతీశ్‌తోపాటు వార్డు మెంబర్ సీతారాంపై కాంగ్రెస్ కార్యక్తర్తలు దాడులు చేయగా వారిని పరామర్శించారు.
అనంతరం గ్రా మంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆగడాలను ప్రశ్నించడానికి వెళ్లిన సర్పంచ్, ఇతరులపై దాడి చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే వంశీకృష్ణ అండతో సర్పంచ్‌పై కర్రలు, రాళ్లతో దాడి చేసి తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజన మహిళా సర్పంచ్‌పై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఎడ్మ బొజ్జు, బెల్లయ్యనాయక్, గిరిజన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించలేద ని నిలదీశారు. వట్టినాగులపల్లిలో రెవెన్యూ మంత్రి భూ కబ్జాలు చేస్తుం టే.. ఇక్కడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కబ్జాలు చేస్తున్నాడని ఆరోపించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కొద్ది రోజులుగా మారెట్లు పతనమవ్వడంతో ఉద్యోగుల పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్(ప్రాన్) ఖాతాల్లోని నికర ఆస్తి విలువ(ఎన్ఏవీ) పడిపోయి, వేలాది రూపాయల సొమ్ము ఆవిరైపోతున్నదని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) రాష్ట్ర నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. తమ రిటైర్మెంట్ జీవితం కోసం దాచుకున్న సొమ్ము కండ్ల ముందే కరిగిపోతుంటే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. సీపీఎస్ విధానం ఎంత ప్రమాదకరమైనదో ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయని పేరొన్నారు.