భైంసా టౌన్, అక్టోబర్ 5 : నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్కు చెందిన రుషిత(25) బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురై మృతి చెందింది. శనివారం రాత్రి గ్రా మంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురైంది.
కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక వైద్యుడి వద్ద చికిత్స చేయించారు. ఆయన సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించేలోపే మృతిచెందింది. రుషితకు గత మే నెలలో వివాహమైంది. అత్తారింట్లో తొలి బతుకమ్మ ఆడుకుందామనుకున్న రుషిత మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.