నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్(Nagarkurnool) మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Marri Janardhan Reddy) మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఆర్థిక పరిస్థితులతో చదువుకు దూరమైన పేదింటి ఆడబిడ్డకు ఆర్థిక చేయూతనందించి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే..నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జెట్ప్రోలు గ్రామానికి చెందిన ప్రహర్ష అనే యువతికి నారాయణపేట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు (MBBS student)వచ్చింది. అయితే ఆర్థిక ఇబ్బందులు వల్ల చదివించలేక పోతుందని యువతి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
దీంతో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. వెంటనే వారి వివరాలు తెలుసుకొని తన MJR చారిట బుల్ ట్రస్టు ద్వారా అ అమ్మాయి ఎంబీబీఎస్ చదవడానికి మొదటి సంవత్సరం ఫీజు 75 వేలు రూపాయల ఆర్థిక సహాయం(Financial assistance) అందజేశారు. మిగతా మూడు సంవత్సరాల ఫీజు తన ట్రస్ట్ ద్వారా చెల్లిస్తానని ఆయన బరోసా ఇచ్చారు. పేదింటి ఆడబిడ్డ చదువుకు అండగా నిలిచిన మర్రి జనార్దన్ రెడ్డిని పలువురు అభినందించారు.