హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన పలువురు నేతలు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు.
హైదారాబాద్‌లోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో గుంటూరు జిల్లాకు చెందిన సినీ నిర్మాత ఎస్ పద్మావతి, ఆద్యరెడ్డి, శివప్రసాద్, తెనాలికి చెందిన హర్షిణి, భవానీప్రసాద్, విశాఖపట్నం జిల్లాకు చెందిన వీ నందిని, ఎం కృష్ణవేణి, తిరుపతి జిల్లాకు చెందిన మైలా సురేఖ, చరణ్‌తేజ్, నిహారిక, కాకినాడకు చెందిన రిషిసాగర్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.