పార్లమెంట్ మౌనం సరికాదు
మణిపూర్ లాంటి కీలక అంశంపై దేశ పౌరులకు విశ్వాసాన్ని కల్పించాల్సిన పార్లమెంట్ మౌనంగా ఉండటం మంచిది కాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు.
- మణిపూర్‌పై చర్చించాలి
- పౌరులకు విశ్వాసం కల్పించాలి
- వాయిదా తీర్మానాల తిరస్కరణపై కేకే ఆగ్రహం
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): మణిపూర్ లాంటి కీలక అంశంపై దేశ పౌరులకు విశ్వాసాన్ని కల్పించాల్సిన పార్లమెంట్ మౌనంగా ఉండటం మంచిది కాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. మణిపూర్ అకృత్యాలపై చర్చించాలని ఉభయసభల్లో వాయిదా తీర్మానానికి పట్టుబడుతున్నా చర్చకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మణిపూర్ అంశంపై సోమవారం సభ ప్రారంభంగానే రాజ్యసభలో కే కేశవరావు, లోక్‌సభలో నామా నాగేశ్వర్రావు వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. రాజ్యసభలో చైర్మన్, లోక్‌సభలో స్పీకర్ ఇందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఉభయసభలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యసభలో 176వ నిబంధన కింద చైర్మన్ జగదీప్ ధన్కర్ స్వల్పకాలిక చర్చకు అనుమతించారు. దీన్ని బీఆర్ఎస్ ఆక్షేపించింది. 267వ నిబంధన కింద మణిపూర్‌పై దీర్ఘకాలిక చర్చ చేపట్టాలని కేశవరావు డిమాండ్ చేశారు. లోక్‌సభలోనూ బీఆర్ఎస్ ఎంపీలతోపాటు విపక్ష ఎంపీ నినాదాలు, నిరసనలతో హోరెత్తించారు. సభ ఆర్డర్లో లేకపోయినా లోక్‌సభలో సినిమాటోగ్రఫీ-2023 బిల్లును అధికార పక్షం తన సంఖ్యాబలంతో ఆమోదింపజేసుకున్నది. అనంతరం కేశవరావు మాట్లాడుతూ.. మణిపూర్ అంశంపై ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లుతున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

