మొన్న తమిళనాడులో జరిగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె లుక్ సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్లో వైరల్ అయింది. తాజాగా ఆ వేడుకకు చెందిన మరిన్ని ఫొటోలను తన ఇన్స్టా ద్వారా షేర్ చేశారు త్రిష. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. పసుపురంగు చీరలో హుందాగా కనిపిస్తున్న త్రిషపై అభిమానులు ప్రశంసలసు కురిపిస్తున్నారు. నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సైతం త్రిషను అభినందిస్తూ కామెంట్ పెట్టారు.
ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘నిన్ను ప్రేమించకుండా ఉండేందుకు నాకు ఒక్క కారణం చెప్పు. లోపల.. బయట అత్యంత అందమైన దానివి నువ్వే..’ అంటూ త్రిషను ఖుష్బు ప్రశంసించారు. త్రిష అందమే కాక, వ్యక్తిత్వాన్ని కూడా మెచ్చుకుంటూ ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.