మక్తల్, ఆగస్టు 18 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిపులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్‌లోని మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు.
దీనిపై ఎన్నిసార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదని, కోర్టు ఆదేశాలను సైతం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.