మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. బాబీ కొల్లి దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత చిరంజీవి-బాబీ కొల్లి కాంబోలో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే 40రోజుల షెడ్యూల్ పూర్తయిందని, దాదాపు సినిమా ప్రథమార్ధం మొత్తాన్ని తెరకెక్కించామని మేకర్స్ తెలిపారు.
ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అంశాల్ని బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు బాబీ అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారని, భారీ స్థాయిలో డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఫస్టాఫ్లో హైలైట్గా ఉంటాయని చిత్రబృందం పేర్కొన్నది. ఈ నెల 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా సినిమాకు సంబంధించిన కీలకమైన అప్డేట్ అందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. అనస్వరరాజన్, నివేదా పేతురాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నారు.