రాంచీ: జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్- కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(జేఎస్ఎస్సీ-సీజీఎల్) పరీక్షను రద్దు చేస్తూ జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర పరిపాలనలో సంక్షోభానికి దారితీసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా నియమితులైన 2,000 మందికిపైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటుండటంతో పలు శాఖలు, కార్యాలయాల పనితీరుపై ప్రభావం పడనున్నది.
ఎంపికైన అభ్యర్థులలో చాలామంది 2025లో ప్రభుత్వ సర్వీసులో చేరారు. వీరు ఆర్థిక, హోం, రోడ్డు రవాణా, కార్మిక, సమాచార పౌర సంబంధాల శాఖలలో పాటు ఇతర పరిపాలనా కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రభుత్వం ప్రకటించింది.