చిక్కడపల్లి, నవంబర్ 26: సీఎం రేవంత్‌రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీలు సంవత్సరం గడుస్తున్నా అమలుచేయకపోవడం దారుణమని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు, వీహెచ్పీఎస్ గౌరవ అధ్యక్షుడు మందకృష్ణ మా దిగ విమర్శించారు. రేవంత్‌రెడ్డి అబద్ధాల పునాదులపై అధికారంలోకి వ చ్చాడని మరోసారి రుజువైందని మం డిపడ్డారు. వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ధ ర్నా నిర్వహించారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6000కు పెంచాలని, కాం గ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చి న హామీలను అమలు చేయాలని వా రు డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ఎంఆర్పీఎస్ అండగా ఉన్నదని చె ప్పారు. ధర్నాలో వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య, జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, జాతీయ కోర్‌కమిటీ చైర్మన్ గోపాల్‌రావు, అందె రాంబాబు, సత్యనారాయణ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంగమ్మ, ప్రజా వాగ్గేయకారుడు సోమన్న, అశోక్ పాల్గొన్నారు.