ములుగు: ములుగు జిల్లాలో (Mulugu) విషాదం చోటుచేసుకున్నది. పోలీసుల కోసం మావోయిస్టులు అమర్చిన మందుపాతర (Landmine) పేలడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. వాజేడు మండలం కొంగాల గుట్టపై కట్టెల కోసం ముగ్గురు వ్యక్తులు అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో ఏసు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏసు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గాయపడినవారిని అదే గ్రామానికి చెందిన రమేశ్, ఫకీర్గా గుర్తించారు. అయితే మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.