సోమవారం 13 జూలై 2020
Telangana - May 28, 2020 , 20:07:41

ప్రాణం తీసిన కరెంట్ పోల్

ప్రాణం తీసిన కరెంట్ పోల్

నల్లగొండ: కరెంట్ స్తంభం విరిగిపడిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. అడవిదేవులపల్లి మండలం బంగారికుంట తండా గ్రామపంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుర్ర దీప్పా అనే వ్యక్తి తన పొలంలో కరెంట్ స్తంభంపై ఉన్న వైర్లు కిందికి వేలాడుతుండటంతో..స్తంభం ఎక్కి వైర్లు సరిచేద్దామనుకున్నాడు. పైకి ఎక్కే ప్రయత్నంలో స్తంభం ఒక్కసారిగా విరిగిపోవడంతో అతడు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo