సూర్యాపేట : సూర్యాపేట( Suryapet) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భూతగాదాలు ఓ (Land dispute)నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నూతన సంవత్సర వేడుకలకు పిలిచి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఈ విషాదకర సంఘటన చివ్వెంల మండలం లక్ష్మి తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన ధరావత్ శేషు(39)కు అదే తండాకు చెందిన తన ప్రత్యర్థులతో కొంత కాలంగా భూ వివాదాలు చేటు చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలో శేషు ప్రత్యర్థులు న్యూఇయర్ వేడుకలకు పిలిచి కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శేషు మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | సర్కారువారి అప్పు మరో 409 కోట్లు.. రూ.1,38,117 కోట్లకు చేరిన రేవంత్ సర్కార్ అప్పు
Telangana | టీచర్ల పరస్పర బదిలీకి 20 లక్షలు! రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ డిమాండ్
Telangana | అమాంతం పెరిగిన అవినీతి! ఏడాదిలో 152 కేసుల్లో 223 మంది అరెస్టు