హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని, నాగర్‌కర్నూల్ నుంచి బరిలో ఉంటానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి చెప్పారు. సోమవారం ఆయన ప్రభుత్వ సలహాదారు హరర వేణుగోపాల్‌తో కలిసి సచివాలయంలోని మీడియా పాయింట్లో మాట్లాడారు. తమకు ప్రభుత్వ సలహాదారులుగా, ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాజీవ్‌గాంధీ హయాంలోనే రామమందిర నిర్మాణానికి పూనుకున్నారని, కోర్టు కేసుల వల్ల పెండింగ్ పడిందని గుర్తుచేశారు. రామాయణం, సుందరాకాండ భారతీయుల డీఎన్ఏలోనే ఉన్నదని, మోదీ కొత్తగా దేశ ప్రజలకు చెప్పాల్సింది.. ఆయన నుంచి వాళ్లు నేర్చుకోవాల్సింది ఏమీ లేదని అన్నారు.