Telangana | సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఖర్గే కీలక ప్రకటన
Telangana | తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపై (telangana cm Candidate) ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (mallikarjun kharge) మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేశారు. సీఎం ఎంపికపై ఖర్గే తాజాగా క్లారిటీ ఇచ్చారు.
Telangana | తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపై (telangana cm Candidate) ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే, ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనడుస్తోంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అవుతారన్న వార్తలు కూడా వచ్చాయి.
సోమవారం సాయంత్రం 8 గంటలకు కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో సైతం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించలేదు. అయితే, ఈ ఉత్కంఠకు తెరదించేలా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (mallikarjun kharge) మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేశారు. సీఎం ఎంపికపై ఖర్గే తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇవాళ సాయంత్రంలోపు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు.
నేడు ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ..
మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. తెలంగాణ కొత్త సీఎం, మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొందరు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. వారు కూడా ఖర్గేతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సీఎం ఎంపికపై సమావేశం జరిగిన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ నుంచి సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ వెళ్లిపోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Also Read..
Telangana CM | కాంగ్రెస్‌లో కుర్చీలాట.. ఇంకా తేలని ముఖ్యమంత్రి అభ్యర్థి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

