KTR | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో 7 ప్రాజెక్టులకు అనుమతిచ్చిందే మీ కేంద్ర ప్రభుత్వం.. 7 ప్రాజెక్టులకు ఆనాడు మేము కష్టపడి అనుమతులు సాధించిన తర్వాత ఇవాళ అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడితే జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టారు. మీకు రేషం, పౌరుషం ఉంటే ఆ మీటింగ్‌ను బాయ్‌కాట్ చేయండి.. అని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఈ విషయమై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అసలు బీజేపీ సిగ్గుంటే మీరిచ్చిన అనుమతులు మీరురద్దు చేయాలని మీ పార్ట్నర్ ఎవరైతే అడుగుతున్నారో.. ఎందుకు రద్దు చేయాలని వారిని ప్రశ్నించండి..? కేంద్ర ప్రభుత్వమే అనుమతిచ్చి కేంద్రప్రభుత్వ ఆధీనంలో ఉండే జీఆర్ఎంబీని రద్దు చేయాలని అజెండాలో పెడుతుంటే సిగ్గులేకుండా మాట్లాడటానికి బీజేపీవాళ్లకు ఏరకంగా మనసు వస్తుందో.. ఏ రకంగా నోరు వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు.. వీటి ఆధారంగా జరిగిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. అలాంటి ఉద్యమంలో మేం రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా బ్రహ్మాండంగా రాష్ట్రం సాధించిన తర్వాత ఒక్కో నీటి బొట్టును ఒడిసి పట్టి తెలంగాణ బీడు భూములకు మలిపే ప్రయత్నం చేసినం.
అది కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి అయితేనేమీ.. ఇంకా చనాకా-కొరాట లాంటి చిన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. అలాంటి అన్నీ ప్రాజెక్టులు వాటితోపాటు మిషన్‌కాకతీయ ప్రాజెక్టులన్నీ చేసి తెలంగాణ నీటి వనరులకు పెద్ద ఎత్తున న్యాయం జరిగే విధంగా, నీటి వనరులను కాపాడుకునే విధంగా మేం ప్రయత్నం చేశాం. అందులో భాగంగా అనుమతులు తెచ్చాం. ఇవాళ ఆ అనుమతులన్నింటిని తుంగలో తొక్కుతం. మా చెప్పు చేతల్లో కేంద్రప్రభుత్వం ఉంది.. కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉంది కాబట్టి నేను ఆడించినట్టే ఆడాలని చంద్రబాబు నాయుడు అనుకుంటే పోరాటం చేసేందుకు మేం సిద్దంగా ఉన్నామన్నారు.
చంద్రబాబునాయుడుకు, ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మా నాయకుడు కేసీఆర్ బేసిన్లు లేవు.. బేషజాలు లేవు నీళ్లు వాడుకుందామని ఎప్పుడో చెప్పారు. కానీ మా కడుపు కొట్టి మా ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తామంటే ఊరుకోం. మీరు పోలవరం కట్టుకుంటే మేమేం అనలేదు కదా.. మీరు పట్టి సీమ నీళ్లు లిఫ్ట్ చేసుకుంటుంటే మేమేం అనలేదు. మాకొచ్చిన అనుమతులను చెడగొట్టకండి అని మేం అంటున్నం. కేంద్రప్రభుత్వం నా చెప్పుచేతల్లో ఉంది.. నేను ఆడిచ్చినట్టు ఆడే చెంచాగాడు తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడున్నడు కదా.. అని అనుకుంటే తెలంగాణ రైతుల తరపున పోరాటమ చేసేందుకు మేం సిద్దంగా ఉన్నామన్నారు. జలసౌధలో జరిగే మీటింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బాయ్‌కాట్ చేయకపోతే.. ఎజెండా మార్చి ఈ 7 ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసే అంశాలను తొలగించకపోతే తెలంగాణలో తప్పకుండా జల ఉద్యమం నిర్మాణం చేస్తామని చెప్పాం. అవసరమైతే ఆ రోజు జలసౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు.
తెలంగాణలో 7 ప్రాజెక్టులను రద్దు చేసే అంశంపై GRMBలో జరిగే మీటింగ్‌ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాయ్‌కాట్ చేయకపోతే జలసౌధని ముట్టడిస్తాం
కేసీఆర్ నాయకత్వంలో 7 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం
ఇవాళ ఆ అనుమతులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడితే GRMB… https://t.co/dQRtqideJR pic.twitter.com/LFcXgdPkIo
— Telugu Scribe (@TeluguScribe) August 11, 2026