Telangana CM | కాంగ్రెస్‌లో కుర్చీలాట.. ఇంకా తేలని ముఖ్యమంత్రి అభ్యర్థి
Telangana CM | సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌లో హైడ్రామా కొనసాగుతున్నది. సీఎం అభ్యర్థిత్వంపై సోమవారం మధ్యాహ్నం వరకు తుది నిర్ణయం వెలువడుతుందని, రాత్రికి ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది.
Telangana CM | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌లో హైడ్రామా కొనసాగుతున్నది. సీఎం అభ్యర్థిత్వంపై సోమవారం మధ్యాహ్నం వరకు తుది నిర్ణయం వెలువడుతుందని, రాత్రికి ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఇదేదీ జరగలేదు. హోటల్ ఎల్లాలో సోమవారం ఉదయం జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం ఎవరనేదానిపై నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు.
కానీ, సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానంతో సమావేశం ముగిసింది. దీనిపై సోమవారం సాయంత్రం వరకు అధిష్ఠానం నిర్ణయం వెలువడుతుందని, రాత్రికి రాజ్‌భవన్‌లో సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది. ఇది కూడా జరగలేదు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నేతలంతా అధిష్ఠానం నిర్ణయం కోసం సాయంత్రం వరకు ఎదురుచూశారు. తీరా సాయంత్రానికి సీఎం అభ్యర్థి ఎంపికను వాయిదా వేస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో నేతలంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
హస్తినకు చేరిన వ్యవహారం
సీఎం ఎంపిక వ్యవహారం చివరికి ఢిల్లీకి చేరింది. సీఎం పోస్టు కోసం ఇద్దరు ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి కత్తిమీద సాములా మారిందని సమాచారం. దీంతో సీఎల్పీ భేటీలో తీసుకోవాల్సిన నిర్ణయం.. ఢిల్లీకి చేరింది. కీలక నేతలను ఢిల్లీకి రావాలని అధిష్ఠానం ఆదేశించింది. దీంతో కర్ణాటక డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, నలుగురు ఏఐసీసీ పరిశీలకులతో కలిసి సోమవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. మంగళవారం సోనియాగాంధీ సమక్షంలో చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకొంటారని భావిస్తున్నారు.
రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు.. చివరికి వాయిదా
అధిష్ఠానం సూచనతో సీఎల్పీ భేటీలో సీఎం అభ్యర్థి ఎంపిక పూర్తవుతుందని, వెంటనే ప్రమాణ స్వీకారం కూడా నిర్వహించాలని పార్టీ భావించినట్టు తెలిసింది. తొలుత సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం చేశారు. ఇందుకు సంబంధించి రాజ్‌భవన్ వర్గాలతోపాటు అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో అధికారులు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేశారు. కుర్చీలు, టెంట్లను తరలించి ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ చివరికి సీఎల్పీ భేటీలో సీఎం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, అధిష్ఠానం కూడా ఎలాంటి నిర్ణయం వెలువరించకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది.
భేటీలో పీటముడులు
నేను ఖాళీగా అయినా ఉంటాను కానీ స్పీకర్ పదవి నాకు అవసరం లేదు.
.. ఇది దుద్దిళ్ల మాట
ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తే.. నాకు ఒక్కడికే ఇవ్వాలి. నాతోపాటు ఇంకెవరికి ఇచ్చినా ఒప్పుకొనే ప్రసక్తే లేదు.
… తేల్చిచెప్పిన భట్టి
రేవంత్‌కు తప్ప సీఎం పదవి ఎవరికి ఇచ్చినా ఓకే.
..ఉత్తమ్ తేటతెల్లం
సీతక్కకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగుంటుంది.
..అధిష్ఠానానికి రేవంత్ సూచన
సీతక్కకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఊరుకునేది లేదు.
.. సీనియర్ నేతల వార్నింగ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

