హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకాలేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాలతోపాటు ముందస్తు షెడ్యూల్ కారణంగా గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కాలేకపోతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.
దీంతో రేవంత్‌రెడ్డి సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్టు చెప్తున్న కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడే రాలేనని తేల్చినప్పుడు ఇతర ప్రముఖులు ఎవరు వస్తారని, అసలు గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.