చేర్యాల, డిసెంబర్ 24 : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లన్న ఆలయం(Mallanna temple) ఆదివారం భక్తుల(Crowded)తో కోలహలంగా మారింది. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. మల్లన్నను ఆదివారం సుమారు 25వేల పై చిలుకు భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు(Devotees) మల్లన్న దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు ఒడిబియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టుకు ముడుపులు కట్టారు. గుట్టపై ఎల్లమ్మను దర్శించుకోవడంతో బొనం సమర్పించి మొక్కులు అప్పజెప్పారు. కాగా, స్వామి వారికి కరీంనగర్‌కు చెందిన మల్లన్న భక్తులపెద్ది అమర్నాథ్- సుచిత్ర దంపతులు స్వామి వారికి కానుకగా లక్షా 29వేల విలువ గల బంగారు కోర మీసంను మల్లన్న ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్యకు అందజేశారు.