మానోపాడు: జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మానోపాడు మండలం నారాయణపురం స్టేజి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. క్రమంగా రెండు లారీలకు వ్యాపించడంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడ్డాయి. చూస్తుండగానే కాలిబూడిదయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో వాహనాదారులు భయాందోళనలకు గురయ్యారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. రెండు లారీల డ్రైవర్, క్లీనర్లు ప్రాణాలతో బయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.