హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రైతుల ఆందోళనలు, ‘నమస్తే తెలంగాణ’ కథనాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మక్కజొన్నల కొనుగోలుపై ఎకరానికి విధించిన పరిమితిని 25 క్వింటాళ్లకు పెంచింది. రైతులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, మకల దిగుబడి అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కొనుగోలు పరిమితిని ఎకరానికి 25 క్వింటాళ్లకు పెంచి కొనుగోలు చేయాలని మార్ఫెడ్ని ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో మారెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఈ సీజన్లో మకల దిగుబడి ఎకువగా ఉం టుందని, మకల కొనుగోలు పరిమితిని ఎకరాకు 18.5 క్వింటాళ్ల నుంచి 25 క్విం టాళ్లకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు.
సమస్యలపై సీసీఐ సీఎండీకి ఫోన్
జిన్నింగ్ మిల్లర్లకు ఎదురవుతున్న ఇబ్బందులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సీఎండీ లలిత్కుమార్గుప్తాతో మంగళవారం ఫోన్ ద్వారా మాట్లాడారు. సీసీఐ అవలంబిస్తున్న ఎల్-1, ఎల్-2, ఎల్-3 అలాట్మెంట్ విధానాన్ని ఎత్తివేయాలని, అన్ని నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లను రెండు రోజుల్లో ప్రారంభించాలని మంత్రి కోరారు. అంతేకాకుండా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా తేమ శాతం 12కుపైగా ఉంటున్నదని, దీనిని సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో, రైతులకు బహిరంగ మారెట్లో మంచి ధర రాకపోవడంతో నష్టపోతున్నారని తుమ్మల వివరించారు. ఎకరాకు 7 క్విం టాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధనను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన సవరణలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సీఎండీని కోరారు. సీసీఐ కొత్త నిబంధనలు, జిన్నింగ్ మిల్లర్ల సమస్యల పరిషారానికి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని కోరుతూ మంత్రి తుమ్మల వారికి లేఖ రాశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డికి సూచించారు.
భూసార పరీక్ష పత్రాల పంపిణీ
ప్రతి మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూసార పరీక్ష పత్రాల పంపిణీని ప్రారంభించారు. ఈ ఏడాది జిల్లాకు ఒక మండలం చొప్పున మొత్తం 32 మండలాలకు చెందిన రైతులకు భూసార పరీక్ష పత్రాలను అందజేయడానికి ఏర్పాట్లుచేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరక్టర్ బీ గోపి, ఉద్యాన శాఖ డైరక్టర్ యాస్మిన్‌బాషా, మారెటింగ్ శాఖ డైరక్టర్ లక్ష్మీబాయితోపాటు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక అధికారులు పాల్గొన్నారు.