సంచులియ్యాలి.. మక్కలు కొనాలి
మక్కలు నింపేందుకు సంచులు లేక.. కొన్నవాటిని తరలించేందుకు లారీలు రాక మక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
- పలు జిల్లాల్లో మక్క రైతుల ఆందోళన.. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలంటూ డిమాండ్
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 13: మక్కలు నింపేందుకు సంచులు లేక.. కొన్నవాటిని తరలించేందుకు లారీలు రాక మక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గన్నీ సంచుల కొరత పేరుతో అధికారులు మక్కలు కొనడం లేదని బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట ఖానాపూర్-తర్లపాడు ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు.
తూకం వేసిన బస్తాలను కూడా లారీల కొరత పేరుతో తరలించడం లేదని, క్వింటాల్‌కు రూ.50తోపాటు అదనంగా డబ్బులను అధికారులు, సిబ్బంది వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గన్నీ సంచులు, లారీలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నదని నిర్మల్ జిల్లా పెంబి కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు.

వర్షం వస్తే మక్కలు తడిసిపోయి నష్టపోతామని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే లారీలను సమకూర్చి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన మక్కలను తరలించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురంలో ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ఆన్లైన్ వేలిముద్రల సేకరణ నిలిచిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. గన్నీ సంచుల కొరత కూడా తీవ్రంగా ఉందన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మూడు రోజులుగా ఆన్లైన్ సేవలు నిలిచిపోవడంతో విసుగు చెందిన రైతులు ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నదని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆన్లైన్ పద్ధతి లేకుండా పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

