మల్యాల, ఆగస్టు 7 : మహిళపై సామూహిక లైంగికదాడి చేసిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్టు సీఐ మాదాసు రాజ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్‌స్టేషన్‌లోని సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఈ నెల 3న జగిత్యాల జిల్లా నూకపల్లి అర్బన్ కాలనీ శివారులోని తన స్నేహితురాలి ఇంటికి వచ్చింది.
అక్కడ తనకు పరిచయం ఉన్న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో మల్యాల మండలం రాజారాం గ్రామానికి చెందిన శివరాత్రి నరేశ్, గుర్రం శ్రీకాంత్ ఇద్దరు స్నేహితులతో వచ్చి వీడియో తీసి బెదిరించారు. శ్రీకాంత్, నరేశ్ సామూహిక లైంగికదాడి చేయగా, ధరూర్‌కు చెందిన మారవేని మల్లేశం, రాజారాం గ్రామానికి చెందిన గుర్రం అంజయ్య కాపలా ఉన్నారు. బాధితురాలు ఈ నెల 6న మల్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు శివరాత్రి నరేశ్, గుర్రం శ్రీకాంత్, మల్లేశం, అంజయ్యను కోర్టు ఎదుట హాజరుపరిచారు.