Maize Farmer | కొడుకుతో ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అనేక తంటాలు పడాల్సి వస్తుంది. తాము పండించిన ధాన్యం గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నలు రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 25 రోజులు అవుతుంది.. బస్తాలు తెచ్చి కూడా వారం రోజులవుతుంది. రేపు మాపు అని అంటున్నరు. కొనుగోలు చేయడం లేదు.. ఏం లేదని ఓ మొక్కజొన్న రైతు వాపోయాడు.
సదరు రైతు మీడియాతో మాట్లాడుతూ.. ఐదెకరాల్లో మొక్కజొన్న పండించిన. అప్పుడు యూరియా కూడా కొరత ఉండేది. అప్పుడు ఆ గోస అంటే ఇప్పుడీ గోస ఉన్నది. కేసీఆర్ పరిపాలనే బాగుండేది.. అప్పుడు గుడ్డెద్దు పోయి బావిలో పడ్డట్టు అయింది. రేవంత్ రెడ్డికి ఓటేస్తే అందరం పోయి చెరువులో పడ్డట్టే అయిందన్నాడు.
రైతు భరోసా అన్నడు.. ఆరు గ్యారంటీలు అన్నడు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం అన్నరు.. అవన్నీ పోయి పాతాళ గంగలో పడ్డయి. గ్యాస్ ఇవాళ చేస్తే రెండు రోజులకు వస్తుందని మండిపడ్డాడు.
25 రోజుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదు
పంట పండిచేటప్పుడు యూరియా కొరత.. ఇప్పుడు ఏమో ఇది
కేసీఆర్ పాలనే బాగుండే.. రేవంత్ రెడ్డికి ఓటు వేసి అందరం పోయి చెరువులో పడ్డట్లు అయింది pic.twitter.com/t3PjwFwUyt
— Telugu Scribe (@TeluguScribe) May 5, 2026