హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ప్రగతిపథంలో పయనిస్తూ దేశానికి రోల్ మాడల్‌గా నిలిచిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి మహారాష్ట్ర నేతలు మంత్ర ముగ్ధులయ్యారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జ్ సహా ఇటీవల పార్టీలో చేరిన నాయకులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాల తీరుతెన్నులను తెలుసుకున్నారు. ప్రజలకు అందుతున్న ప్రగతి ఫలాల ను చూసి నాయకులు ఆశ్చర్యపోయారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ దేశానికే రోల్ మాడల్‌గా ఎదుగుతూ స్ఫూర్తిని నిం పుతున్నదని ప్రశంసలు కురిపించారు.
మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నాయకుల బృందం మొదట సిద్దిపేట జిల్లా సింగాయిపల్లి ఫారెస్ట్ ను సందర్శించింది. అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. కంటివెలుగు పథకం కింద ఉచిత కంటి పరీక్ష లు, అద్దాల పంపిణీ తీరును పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజారోగ్యంపై తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశంసించా రు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఇంటిగ్రేటె డ్ మారెట్ను పరిశీలించారు.
వెజ్, నాన్‌వెజ్ మారెట్ల నిర్వహణ తీరు, సీఎం కేసీఆర్ దూ రదృష్టిని మెచ్చుకున్నారు. అక్కడి నుంచి గజ్వేల్‌లోని కోమటిబండలో మిషన్ భగీరథ ప్రాజెక్టును పరిశీలించారు. స్వచ్ఛమైన తాగునీటి స రఫరా తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ ప థకాన్ని కేంద్రం ఎందుకు ఆదర్శంగా తీసుకున్నదో తెలుసుకొని నివ్వెరపోయారు. కుకునూర్‌పల్లిలో రైతు వేదికను పరిశీలించారు. రైతుల అవసరాలను తీరుస్తూ కేసీఆర్ వ్యవసాయా న్ని పండుగ చేసిన తీరును కండ్లారా చూశారు.
మల్లన్నసాగర్.. మహోన్నత జలదృశ్యం
బీడు భూములను పంట భూములుగా మ లుస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టును చూసి సీఎం కేసీఆర్ మాత్రమే అసాధ్యాలను సుసా ధ్యం చేయగలడనే విశ్వాసాన్ని మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ పరిపాలన సముదాయాన్ని, కమిషనర్ ఆఫీస్‌ను పరిశీలించారు. రాష్ట్ర సచివాలయానికి ఉండాల్సిన హంగుల తో కలెక్టరేట్లను నిర్మించడం గొప్ప విషయమ ని ప్రశంసించారు. ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మించిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వా మి దేవాలయాన్ని సందర్శించారు. రాష్ట్ర ప్ర భుత్వం అత్యద్భుతంగా దేవాలయాన్ని తీర్చిదిద్దిందని కొనియాడారు. క్షేత్రస్థాయిలో సాగి న పర్యటన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో పర్యటించిన ‘మహా’ గులాబీ నేతలు వీరే..
ఎన్సీపీ ఔరంగాబాద్ జిల్లా అధ్యక్షుడు సునీల్ సోలంకే, శివ్‌సంగ్రామ్ పార్టీ నాందేడ్ జిల్లా అధ్యక్షుడు ఉమేశ్ పాటిల్, బీడ్ జిల్లా అధ్యక్షుడు గజానంద్ థోరట్, అంబె జొగాయి తాలుకా తహసిల్ ప్రెసిడెంట్ అనిల్ అడుసుల్, ముసా దేశాయ్ – చావా (నాందేడ్ జిల్లా అధ్యక్షుడు), లాతూర్ జిల్లా మాజీ జడ్పీ మెంబర్ దేవానంద్ ములే, సుశీల్ గోఠె (ఆహ్మద్ పూర్) శివ్లింగ్ శివచాలి మహారాష్ట్ర ట్రస్ట్ స్టేట్ సెక్రటరీ, సంతోష్ కచ్రే- ఏక్నాథ్ షిండే మాజీ పర్సనల్ సెక్రటరీ, సైలేశ్ సరటే- శివ సంగ్రామ్ ప్రదేశ్ ప్రెసిడెంట్ మహారాష్ట్ర స్టేట్, నగేశ్ కాంబ్లే – శివ సంగ్రామ్ తాలుకా ప్రెసిడెంట్ ముఖేడ్, బాపు సాహెబ్ దేశ్‌ముఖ్- శివ సంగ్రామ్ జిల్లా అధ్యక్షుడు – బుల్డానా, శివాజీ పాటిల్- మాజీ జడ్పీ మెంబర్ – బుల్డానా, జ్ఞానేశ్వర్ జగ్దాలే – మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన లాతూర్ జిల్లా అధ్యక్షుడు తదితరులు పర్యటించారు. వీరి వెంట బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులున్నారు.