హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): సీపీఎస్ విద్రోహదినమైన సెప్టెంబర్ 1న సీపీఎస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాకు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. సర్కారుపై ఒత్తిడి పెంచేందుకే ప్రతీ ఉద్యోగి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు.