హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్‌లో శాంతియుత నిరసన కార్యక్రమానికి పోలీసులతో అనుమతి నిరాకరించడం అనేది అధికార దుర్వినియోగానికి, ప్రజాస్వామ్య హేళనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. నిజాన్ని ఎదురొనే ధైర్యం లేకపోవటాన్ని, సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థతను ఇది సూచిస్తున్నదని గురువారం ఎక్స్ వేదికగా విమర్శించారు. ఆధారం లేని కారణాలను చూపిస్తూ పోలీసు వ్యవ స్థ పాలకులకు బానిసగా వ్యవహరిస్తూ రాజ్యాంగ స్వేచ్ఛను కాలరాస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘ఇది ట్రాఫిక్, శాంతి భద్రతల సమస్య కాదు. ఇది నిజాలు చెప్తున్న వారి గొంతు నొకడం, లగచర్లలో జరిగిన దుర్మార్గాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నాన్ని అడ్డుకోవడం, నిరసన తెలిపే హకుకు భయపడిన ప్రభుత్వం నిర్లజ్జగా, నిష్ఠూరంగా ఆందోళనలను అణచివేయడం’ అని దుయ్యబట్టారు. ‘ఇది పాలన కాదు. ఇదో నియంతృత్వం. శాంతియుత నిరసనకు అనుమతి నిరాకరణ, దానితోపాటు 5000 మందికిపైగా పోలీసులను మోహరింపచేసి అణచివేయడం ప్రజాపాలనకు తగిన విధానం కాదు’ అని విమర్శించారు.