హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు పదవులు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం జగ్జీవన్‌రాం జయంతి ఉత్సవాలను నిర్లక్ష్యం చేసి, అవమానించిందని మండిపడ్డారు. ప్రభుత్వం తరపున పత్రికలలో ప్రకటన కూడా ఇవ్వలేదని తెలిపారు. మనుషులంతా సమానమనే భావన వచ్చినప్పుడే నిజమైన సమతారాజ్యం వస్తుందని, అదే జగ్జీవన్‌రాంకు అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో పొట్టపెంజర రమేశ్, శాంతికిరణ్, చాప కృష్ణ, రాజేశ్‌ఖన్నా, కొల్లూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.