చట్టసభల్లో చర్చ అంటేనే ప్రభుత్వం లాగు తడుస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనచారి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు అసెంబ్లీలో జవాబు ఇవ్వని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండటం లేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను బుల్డోజ్ చేస్తుందని మధుసూదనచారి మండిపడ్డారు. ప్రతిపక్షాలు అడిగిన ఏ ఒక్కదానికీ జవాబివ్వని పరిస్థితి ఉందని విమర్శించారు. మేం లేవనెత్తిన అంశలపై పలాయనం చిత్తగించడం కనిపిస్తోందని అన్నారు. ఎగవేతలు, ఎదురుదాడి, అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ఇంత బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని అన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు.