హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిషరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం పేదలకు చెందిన లక్షల దరఖాస్తులు ఏండ్ల తరబడి పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు.
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): త్వరలో ఎన్నికలు జరుగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గ టీచర్స్ అభ్యర్థిగా పులి సరోత్తంరెడ్డి(వరంగల్), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ నియోజకవర్గ టీచర్స్ అభ్యర్థిగా మల్క కొమరయ్య(పెద్దపల్లి), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా సీ అంజిరెడ్డి(సంగారెడ్డి)ని ఖరారుచేశారు.