హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
దీని ప్రభావంతో వచ్చే రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. శుక్రవారం నుంచి రాష్ట్రంలో రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వెల్లడించింది. గాలిలో తేమ తగ్గడం వల్ల చలిగాలుల తీవ్రత పెరుగుతుందని తెలిపింది.