వినాయకనగర్/నవీపేట, జూలై 19: సూర్యపేట జిల్లా కోదాడవాసి వెంకటేశ్వరరావుకు చెందిన లారీ సిమెంట్‌లోడ్‌తో గురువారం నిజామాబాద్‌కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో 30 టన్నుల పసుపు బస్తాలతో డ్రైవర్ రమేశ్ గుంటూరుకు బయల్దేరాడు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్దకు రాగానే కారులో వచ్చిన ఇద్దరు అగంతకులు ఆర్టీఏ అధికారులమని బెదిరించి, లారీతో సహా అక్కడి నుం చి పరారయ్యారు.
నాలుగు వ్యాన్లలో 120 పసుపు బస్తాలను నవీపేటలోని ఓ గదిలో డంప్ చేశారు. జీపీఎస్ ఆధారం గా జన్నేపల్లిలో లారీ ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు లారీని, నవీపేటలో పసుపు బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. నవీపేటకు చెందిన ఓ వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.
పోలీసుల డీపీలతో ‘సైబర్’ కాల్స్!
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరగాళ్లు పోలీసుల ఫొటోలు డీపీలుగా పెట్టుకొని కాల్స్ చేస్తున్నారు. వీరితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ జితేందర్ ఎక్స్ వేదికగా ప్రజలను కోరారు. అపరిచితులు కాల్ చేసి.. డ్రగ్స్, హత్య, రేప్ కేసులోనో మీ వాళ్లను అరెస్టు చేశామని నకిలీ వ్యక్తులతో మాట్లాడించి బురిడీ కొట్టిస్తారు. అలాంటి కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.