కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. హుజురాబాద్ మండలం మాందాడిపల్లిలో వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి లారీ చెట్టును ఢీ కొట్టింది. ప్రమాంలో లారీ క్యాబిన్లో ఇరుక్కుని క్లీనర్(Lorry cleaner) అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి డ్రైవర్ను స్థానికులు, ఫైర్ సిబ్బంది బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..