Kerala High Court: మహిళల శరీరంపై కామెంట్ చేసినా.. లైంగిక వేధింపే అవుతుంది: కేరళ హైకోర్టు
Kerala High Court: మహిళల శరీర శౌష్టవంపై ఎటువంటి కామెంట్ చేసినా.. అది లైంగిక వేధింపు అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది. తనపై నమోదు అయిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆ రాష్ట్ర విద్యుత్తు శాఖకు చెందిన ఉద్యోగి పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
కొచ్చి: మహిళల శరీరం నిర్మాణంపై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా.. అది లైంగిక వేధింపు అవుతుందని కేరళ హైకోర్టు(Kerala High Court) పేర్కొన్నది. జస్టిస్ ఏ బదరుద్దీన్ ఈ తీర్పును ఇచ్చారు. కేరళ విద్యుత్తు శాఖకు చెందిన ఓ మహిళా ఉద్యోగినిపై మరో ఉద్యోగి కామెంట్ చేశారు. దీంతో ఆమె లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. 2013 నుంచి ఆ ఉద్యోగి చాలా అసభ్యకరమైన భాషను వాడారని, 2017లో అభ్యంతరకరమైన మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ చేసేవాడని ఆమె ఆరోపించింది. విద్యుత్తు శాఖకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయిందన్నారు.
మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీలోని సెక్షన్ 354ఏ(లైంగిక వేధింపులు), 509(మహిళను కించపరచడం), సెక్షన్120(ఓ) కింద కేసు బుక్ చేశారు. కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్ 120(ఓ) కింద కూడా ఆ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కోర్టు పేర్కొన్నది. అయితే కేవలం శరీర శౌష్టవం బాగుందని కామెంట్ చేసినంత మాత్రానా.. తనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారని, ఆకేసును కొట్టివేయాలని విద్యుత్తు శాఖ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు.
కాల్స్, మెసేజ్‌లతో నిందిత వ్యక్తి లైంగిక వేధింపుల కామెంట్స్ చేసినట్లు మహిళా ఉద్యోగి ఆరోపించింది. అయితే ఐపీసీలోని సెక్షన్ 354ఏ, 509తో పాటు సెక్షన్ 120 కేరళ పోలీసు చట్టం ప్రకారం నిందితుడిపై తగిన ఆధారాలు ఉన్నట్లు హైకోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
Rudravanam PS | ‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: డైరెక్టర్ హరీష్ శంకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

